News January 3, 2026
వికారాబాద్‌లో వనమూలికల ఉన్నాయని తెలుసా?

వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కలు విరివిగా ఉండటంతో అక్కడి వాతావరణం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మేవారు. ఈ చెట్ల వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని, ఊపిరితిత్తులు బలపడతాయని భావించి 1920 ప్రాంతంలో టీబీ రోగులు వికారాబాద్ అడవులకు వెళ్లి కొంతకాలం నివసిస్తూ ఆరోగ్యం మెరుగుపడుతుందని అక్కడే నివసించేవారట. మీరూ దీని గురించి విన్నారా?
Similar News
News February 10, 2026
‘ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు చేపట్టాలి’

జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందేలా అన్ని సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ కలెక్టరేట్లో ఆహార భద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు.
News February 10, 2026
‘కౌంటింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలి’

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను మైక్రో అబ్జర్వర్లు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి.పాటిల్ తెలిపారు. కౌంటింగ్ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్నారు.
News February 10, 2026
ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

ఈనెల 11వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. జిల్లాలోని 288 పోలింగ్ కేంద్రాలకు గాను 345 మంది ప్రిసైడింగ్ అధికారులు, 864 మంది ఓపిఓలు కలిపి మొత్తం 1036 మంది ఎన్నికల అధికారులను కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.


