News October 3, 2025
వికారాబాద్‌లో విషాదం

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దురు బాలికలు మృతి చెందారు. ఈ ఘటన దుద్యాల మండలం అల్లికానిపల్లిలో జరిగింది. మృతులు వృక్షిత(15), ప్రణీత(16)గా స్థానికులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 3, 2025
MBNR: స్నాతకోత్సవం.. PU దేశంలోనే గిన్నిస్ రికార్డు

పాలమూరు విశ్వవిద్యాలయం (PU) MBNRలో 2008లో ఏర్పాటు చేశారు. 2010 నవంబరు 12న NSS(జాతీయ సేవా పథకం) విభాగం ఆధ్వర్యంలో 2,500 మందితో ‘లార్జెస్ట్ బేర్పుట్ వాక్’ అనే కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయంగా పాలమూరు యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.
News October 3, 2025
NRPT: నామినేషన్ దాఖలకు అవసరమైన పత్రాలు ఇవే..

ZPTC, MPTC మొదటి విడత ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రంతో పాటు, ఓటర్ గుర్తింపు, ఎన్నికల డిపాజిట్ రసీదు, 3 పాస్‌పోర్టు ఫొటోలు సమర్పించాలి. పార్టీ అభ్యర్థుల అయితే బీఫామ్ తప్పనిసరి జతచేయాలి. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల ధ్రువపత్రంపై గెజిటెడ్ సంతకం చేయించి జత చేయాలి. ఎన్నికల వ్యయం నిర్వాహకునకు కొత్త బ్యాంకు ఖాతా ఆర్వోకు సమర్పించాలి.
News October 3, 2025
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP: సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, జలవనరుల, విద్యుత్ శాఖ పనులు, అమృత్ పథకం 2.0 పనులకు, ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ₹15,000, అమరావతిలో SPV ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.