News November 6, 2025
వికారాబాద్‌లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.
News November 6, 2025
రేపు ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన: NZB కలెక్టర్

వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని శుక్రవారం సామూహిక గీతాలాపన ఉంటుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News November 6, 2025
విద్యార్థులను ప్రోత్సహించడానికే చెకుముకి పోటీలు: డీఈవో

విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా చెకుముకి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సంగారెడ్డిలోని డీఈవో కార్యాలయంలో చెకుముకి పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సూచించారు.


