News March 13, 2025
వికారాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు.. ఇంటర్ తప్పనిసరి

అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 287 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో 238 హెల్పర్ పోస్టులు, 49 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి టీచర్ పోస్టుకు ఇంటర్ అర్హత తప్పనిసరిగా చేశారు. ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది.
Similar News
News March 13, 2025
ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే వంతెనపై ప్రజల్లో ఆశాభావం

అమ్రాబాద్-పదర మండలాలను కలిపే కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నల్లమల ప్రజలకు దశాబ్దాల కల. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరిగితే, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తావన వచ్చినా అమలు కాలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం NGKL జిల్లా కావడంతో, 30ఏళ్ల కల నెరవేరుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమౌతోంది.
News March 13, 2025
HCUకు ఉత్తమ యూనివర్సిటీగా గుర్తింపు

ప్రముఖ యూనివర్సిటీ HCUకు అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలపై స్టడీ నిర్వహించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 1700 విశ్వవిద్యాలయాల్లో సర్వే చేయగా ఏడు సబ్జెక్టుల్లో ర్యాంక్ పొందింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, సోషియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్‌లో ఉత్తమ ర్యాంకులను సాధించింది.
News March 13, 2025
నల్గొండ: హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి: SP

హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆకతాయిల కోసం షీ టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. హోలీ వేడుకలలో అల్లరి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.