News February 6, 2025
వికారాబాద్: అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తాం: అదనపు కలెక్టర్

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం, చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు, హౌసింగ్ ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు, సలహాలు చేశారు.
Similar News
News December 25, 2025
కామారెడ్డి: మరో మూడు రోజులు శీతలమే

కామారెడ్డి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 8°C నుంచి 9.5°C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆరంజ్ అలర్ట్‌లో జిల్లా ఉండబోతుందని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. చల్లని వాతావరణంలో బయటకు రావడం తగ్గించాలన్నారు.
News December 25, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,045
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,921
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2,260
News December 25, 2025
GNT: వాజ్‌పేయి వాణికి.. యజ్ఞనారాయణ అనువాదం!

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సందేశాలను తెలుగులో ప్రజలకు చేరవేయడంలో గుంటూరుకి చెందిన జూపూడి యజ్ఞనారాయణ కీలక పాత్ర పోషించారు. జనసంఘ్, బీజేపీ నేతగా, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన యజ్ఞ నారాయణ, వాజ్‌పేయి హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదకుడిగా ప్రజాదరణ పొందారు. వాజ్‌పేయి హిందీ ప్రసంగాలను ఆసక్తిగా వినే గుంటూరు ప్రజలతో ఆయన అనుబంధానికి యజ్ఞ నారాయణ ప్రధాన వారధిగా నిలిచారు.


