News April 8, 2026
వికారాబాద్: ఈ అమ్మాయి GREAT..!

తండ్రి మరణించినా ఆ బాలిక గుండె నిబ్బరం కోల్పోలేదు. తండ్రి భౌతికకాయం ఇంట్లోనే ఉండగా, ఆయన కన్న కలలను నెరవేర్చేందుకు కన్నీళ్లను దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరైంది. ధరూర్‌లోని బోజ్య నాయక్ తండావాసి రవి నాయక్ మంగళవారం మృతిచెందగా, ఆయన కుమార్తె శశికళ కేరెల్లిలో బయాలజీ పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన వెంటనే ఇంటికి చేరుకొని తండ్రి చివరిచూపుకు నోచుకొని అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News April 8, 2026
ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డులో ఏ పార్టీ వారు ఎంతమంది అంటే..?

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డును 16 మందితో ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వీరిలో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, జనసేన పార్టీకి చెందిన వారు ఇద్దరు, BJPకి చెందిన ఒకరికి ట్రస్ట్ బోర్డులో పదవులు దక్కాయి.
News April 8, 2026
సూర్యాపేట: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మేళ్లచెరువుకు చెందిన 20 మంది భక్తులు బొలెరోలో దురాజ్‌పల్లి గట్టుకు వెళ్తుండగా వారి వాహనాన్ని తెల్లవారుజామున డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సతీశ్ (25), నర్సింహారావు (36) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News April 8, 2026
ఇరాన్ షరతులు.. US ఒప్పుకుందా?

ఇరాన్ చేసిన 10 ప్రతిపాదనలను పాకిస్థాన్ అమెరికా ముందుంచింది. వీటిని US అంగీకరించిందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెబుతోంది. కానీ ఇంకా వాటిపై చర్చలు జరగలేదు. ఈ నెల 10న పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు జరపనున్నాయి. అప్పటివరకు సీజ్‌ఫైర్ అమల్లో ఉండనుంది.


