News January 2, 2026

వికారాబాద్: ఈ ఫ్యామిలీ GREAT

image

‘కలసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం’ అంటుంది VKBలోని బొంరాస్‌పేట మండలానికి చెందిన నీరటి నర్సమ్మ కుటుంబం. కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో నేటికీ మేము కలిసే ఉంటున్నామంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమెకు మొత్తం నలుగురు కుమారులు, వారి భార్యలు, ఆరుగురు మనవళ్లు,11 మంది మనవరాళ్లు, ముని మనవడు, ముని మనువరాలు మొత్తం 27 మంది ఒకే దగ్గర ఉంటూ అన్ని కార్యక్రమాలను కలిసి నిర్వహించుకుంటున్నారు.

Similar News

News January 9, 2026

నందిగామకు Dy.CM పవన్ కళ్యాణ్ రాక.?

image

నందిగామలో Dy.CM పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన ఆయన మునగచర్ల గ్రామానికి విచ్చేయనున్నట్లు సమాచారం. గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘గోకులం’ షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. Dy.CM హోదాలో పవన్ తొలిసారి ఈ ప్రాంతానికి వస్తుండటంతో జనసైనికులు భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్, పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

News January 9, 2026

నాణ్యత లేదని కొన్న పంటను తిరిగి పంపేశారు

image

TG: సోయాపంట విక్రయించిన రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రైతులు అమ్మిన సోయా గింజల్లో నాణ్యత లేదంటూ వేలాది క్వింటాళ్ల సోయా బస్తాలను వెనక్కి తిరిగి పంపుతున్నారు. ఆ బస్తాలను తిరిగి తీసుకెళ్లాలని రైతులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి సహా ఇతర జిల్లాల్లో సోయా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

News January 9, 2026

నల్గొండ: ఊసే లేని రూ.12 వేల ఆర్థిక సాయం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. పథకాలు ప్రారంభించడమే తప్ప కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ సర్కార్ తీరుపై కూలీలు మండిపడుతున్నారు. భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలన గ్రామ సభల్లో NLG నుంచి 15,485, సూర్యాపేటలో 22,186, యాదాద్రిలో 11,551 మంది దరఖాస్తు చేసుకున్నారు.