News April 1, 2025

వికారాబాద్: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి !

image

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం జిల్లాలో 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు బయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బోసిపోయాయి. భారీ ఎండల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News January 10, 2026

కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

image

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.

News January 10, 2026

అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

image

AP: అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. CBN ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదు’ అని తెలిపారు.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇరకం దీవిలో ఇదే స్పెషల్!

image

పులికాట్ సరస్సుకు మధ్యలో ఉండే ఇరకం దీవికి వెళ్లాలంటే 8 KM పడవ ప్రయాణం చేయాలి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ ఉప్పునీరున్నా.. ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత.