News February 8, 2025

వికారాబాద్: ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య 

image

ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సీఐ భీమ్ కుమార్ తెలిపిన వివరాలు.. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ వాసి సత్యనారాయణ వికారాబాద్‌లోని గాంధీ కాలేజీ వద్ద అద్దెకు ఉంటున్నారు. ఆయన కూతురు జ్యోతి(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కుటుంబీకులు ఊరెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 8, 2025

గాజువాక: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలో గల దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో అగనంపూడి రైల్వే ట్రాక్ వద్ద రాదేశ్(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

News February 8, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

image

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.

News February 8, 2025

విజయవాడ: సీఎం చంద్రబాబును కలిసిన శాప్ ఛైర్మన్ 

image

శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాభివృద్ధి అంశాలపై చర్చించి, పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాల విడుదలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో క్రీడలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించి, ప్రణాళిక సిద్ధం చేస్తే త్వరలోనే కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. 

error: Content is protected !!