News September 6, 2025

వికారాబాద్ ఎస్పీ కీలక సూచనలు

image

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
* సాధ్యమైనంతవరకు ఉదయమే శోభయాత్రను ప్రారంభించాలి.* అప్పుడు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. * చీకటి పడక ముందే నిమజ్జనం వీలవుతుంది.* ఎక్కడపడితే అక్కడ నిమజ్జనం చేయరాదు. * నిర్దేశిత దేశాల్లో నిమజ్జనం చేయాలి. * డీజేలకు అనుమతి లేదు.*అనుకోని ఘటనలు ఎదురైతే డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.

Similar News

News September 6, 2025

పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

image

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.

News September 6, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.

News September 6, 2025

స్పిరిట్ 70% BGM పూర్తైంది: సందీప్ వంగా

image

జగపతిబాబు టాక్ షోలో సందీప్ రెడ్డి వంగా, RGV ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘ప్రభాస్ స్పిరిట్ మూవీకి 70% BGM పూర్తైంది. రన్ టైమ్ 3 గంటల్లోపే ఉంటుంది. నా దృష్టిలో ఇప్పటికీ బాహుబలి2 ఇంటర్వెల్ మహాద్భుతం. RGV నాకు గురువులాంటి వారు. ఆయన మూవీస్ నుంచి చాలా నేర్చుకున్నా. సత్య సినిమా 60 సార్లు చూసుంటా’ అని సందీప్ తెలిపారు. రాజమౌళి, సందీప్‌లో ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ అని అడగ్గా RGV సందీప్ పేరు చెప్పారు.