News March 25, 2025
వికారాబాద్: ‘ఓవర్సీస్ స్కాలర్షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి’

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని VKB జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి మల్లేశం తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అర్హులైన విద్యార్థులకు మే 19 వరకు అవకాశం ఉందన్నారు. https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.
Similar News
News November 17, 2025
మృతుదేహాలు వస్తాయా రావా సాయంత్రం తెలుస్తోంది: నాంపల్లి MLA

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని, మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడని, ఇక్కడ బాధిత కుటుంబాలను కలిశానని నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ అన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధికుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారని, బాధ్యత కుటుంబాలను ఆదుకుంటామని, మృతుదేహాలు వస్తాయా రావా అనేది సాయంత్రం తెలుస్తుందన్నారు.

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు RTC బస్సులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అందుబాటు ధరల్లో సురక్షితంగా భక్తులను శబరిమల యాత్రకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అద్దె ప్రాతిపదికన బస్సులను సమకూర్చుతామని కుషాయిగూడ డీఎం వేణుగోపాల్ తెలిపారు. గురుస్వామి, కన్నెస్వామి, వంటమనుషులకు మొత్తం ఐదుగురికి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు. 99592 26145 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.