News February 18, 2025
వికారాబాద్: కేసులు పెండింగ్ ఉంచరాదు: ఎస్పీ

పాత కేసులను పెండింగ్ పెట్టరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ , పోక్సో కేసులపై దృష్టి పెట్టాలన్నారు. 100 డైల్ వస్తే నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్‌లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడల్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకర్శించింది. యూసుఫ్‌గూడ మారుతీనగర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఓటర్లను స్వాగతించింది. ఉత్సాహంగా, సమ్మిళితంగా పోలింగ్ జరిగినట్లు CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్‌లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన షేక్‌పేటలోని సక్కు బాయి మెమోరియల్ హైస్కూల్ మోడల్ పోలింగ్ స్టేషన్ నం.19లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఓటు వేయడానికి వరుసలో నిల్చున్నారని, ఇది ప్రజాస్వామ్యం ఫరిడవిల్లునట్లే అని CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
HYD: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని BRS ప్రతినిధుల బృందం HYD BRK భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.


