News January 17, 2026
వికారాబాద్: ఖరారైన మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు

వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో ఎస్సీ మహిళ, తాండూరు మున్సిపాలిటీ బీసీ జనరల్, పరిగి మున్సిపాలిటీలో బీసీ మహిళ, కొడంగల్ – అన్ రిజర్వుడ్‌గా వచ్చింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు ఛైర్మన్ పదవిపై కన్నేశారు. కొడంగల్లో అన్ రిజర్వుడ్ కావడంతో పోటీ పెరగనుంది.
Similar News
News February 19, 2026
లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సమయంలో మార్పులు

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైం టేబుల్ మారింది. లింగంపల్లిలో ఉదయం 6:55, బేగంపేటలో 7:20, సికింద్రాబాద్‌లో 7:40, చర్లపల్లి 8:00, రామన్న పేట 8:30, నల్గొండ 9:00, మిర్యాలగూడ 9:30కు చేరుతుంది. నడికుడి జంక్షన్ 10:00, పిడుగురాళ్ల 10:20, సత్తనపల్లి 10:45, గుంటూరు జంక్షన్ 11:45కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News February 19, 2026
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.
News February 19, 2026
శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.


