News April 1, 2025
‘వికారాబాద్ జిల్లాలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతను దరఖాస్తులకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Similar News
News December 26, 2025
HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News December 26, 2025
ప్రతి పనికీ AI ఉపయోగిస్తున్నారా?

ప్రతి చిన్న పనికీ AI టూల్స్‌ను ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులను మూడు విభాగాలుగా చేసి.. వారిని ChatGPT, Google Gemini సాయంతో పాటు సొంతంగా ఎస్సే రాయమన్నారు. AIని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. అధికంగా AIపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.