News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

image

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 2, 2026

SPMVV: దరఖాస్తులకు గడువు పొడిగింపు

image

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లా సెట్, ఏపీ పీజీ లాసెట్‌కు దరఖాస్తులు చేసుకునే తేదీనీ మార్చ్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ సీతాకుమారి తెలిపారు. అలాగే అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మే నెల 4 వ తేదీన జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News March 2, 2026

‘PGRS అర్జీలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు’

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.