News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

image

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 12, 2026

సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

image

ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం చందనోత్సవం టికెట్లను ఏప్రిల్ 13 నుంచి 17వరకు విక్రయించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.300,రూ.1000, దర్శన టికెట్లు అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ ఎఅమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in ద్వారా రూ. 300,రూ.1000 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.

News April 12, 2026

ప్రచారంలో బ్రేక్.. IPL చూసిన సీఎం

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాసేపు రిలాక్స్ అయ్యారు. కారులో వెళ్తూ ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన IPL మ్యాచ్ వీక్షించారు. ‘హై ఓల్టేజ్ ప్రచారంలో IPL బ్రేక్. సంజూ శాంసన్ సెంచరీ చేసినప్పటికీ.. నా అభిమాన క్రికెటర్ ధోనీని మిస్ అవుతున్న భావన పోవడం లేదు’ అని ట్వీట్ చేశారు. మ్యాచ్ చూస్తున్న ఫొటో షేర్ చేశారు. తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.