News March 10, 2025
వికారాబాద్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సంవత్సరంలో వర్షాలు తక్కువగా కురవడంతో వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. నీటిని వృథా చేయొద్దని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2025
అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

AP: టీటీడీ ఆస్థాన గాయకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గరిమెళ్ల ఇద్దరు కుమారులు అమెరికా నుంచి మంగళవారం తిరుపతి చేరుకోనున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 10, 2025
సమస్యలను పరిష్కరించండి: కర్నూలు జిల్లా కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా తీసుకున్న అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ బి.నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు.
News March 10, 2025
బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.