News February 28, 2025
వికారాబాద్ జిల్లాలో నేటి కార్యక్రమాలు

✓ వికారాబాద్: నేడు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న స్పీకర్.✓ పరిగి: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే.✓ తాండూరు: నేడు జీవన్గి గ్రామంలో కుస్తీల పోటీలు.✓ కొడంగల్: నేటి నుండి అడవిలా మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం.✓ బంట్వారం: నేడు మేకల సంతలో అన్నదానం.✓ కుల్కచర్ల: నేడు పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం.✓ తట్టేపల్లి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
Similar News
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.
News July 6, 2025
అందరూ ఇంకుడు గుంతలు నిర్మించండి: MD

గ్రేటర్ HYDలో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి సూచించారు. జలమండలి పరిధిలో ఇంకుడు గుంతలకు సంబంధించి ప్రతి ఇంటింటికి సర్వే నిర్వహించింది. సర్వేలో 40,206 ఇండ్లను గుర్తించిన అధికారులు, ఇంకుడు గుంతలు 22,813 భవనాల్లో ఉన్నట్లుగా గుర్తించారు.17,393 భవనాలలో ఇంకుడు గుంతలు లేవు. దీని కారణంగా 16,066 మందికి జలమండలి నోటీసులు జారీ చేసింది.