News March 5, 2025

వికారాబాద్ జిల్లాలో బుధవారం ముఖ్యాంశాలు

image

✓ కొడంగల్, దుద్యాలలో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజనుల పాలాభిషేకం.✓ VKB జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.✓ కొడంగల్: పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల బిల్లులు కలెక్టర్‌కు మాజీ కలెక్టర్‌కు పాఠశాలలో AI తరగతులను పరిశీలించిన బెంగుళూరు బృందం.✓VKB:విద్యార్థినిని పరామర్శించిన స్పీకర్

Similar News

News January 11, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 11, 2026

మోసపోయిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య

image

TG: CBI మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాల పేరుతో వాట్సాప్ ద్వారా వల వేసిన ముఠా ఆమె నుంచి రూ.2.58కోట్లు కొట్టేసింది. నకిలీ ట్రేడింగ్ టిప్స్, తప్పుడు స్క్రీన్ షాట్లతో నమ్మించి పెట్టుబడులు పెట్టించింది. లాభాలు కనిపించినా డబ్బు విత్‌డ్రా అవకాశం లేకపోవడంతో మోసం బయటపడింది. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 11, 2026

కోళ్ల ఫారంలో ఈ తప్పు చేయొద్దు

image

కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్లను ఎప్పుడూ దాణా బస్తాలపై ఉంచకూడదు. ఇలా చేస్తే మరణించిన కోడిలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు దాని శరీరం నుంచి దాణాలోకి చేరతాయి. ఈ దాణాను మనం షెడ్డు మొత్తం కోళ్లకు వేస్తాము. దీంతో ఆ బాక్టీరియా షెడ్డులో కోళ్లకు వ్యాపించి అవి కూడా మరణిస్తాయి. అందుకే వ్యాధితో ఏదైనా కోడి మరణిస్తే షెడ్డు నుంచి దూరంగా వాటిని పూడ్చిపెట్టాలి. ఈ విషయంలో పెంపకందారులు జాగ్రత్త వహించాలి.