News March 7, 2026

వికారాబాద్ జిల్లాలో భానుడి భగభగ

image

వికారాబాద్ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శనివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ చల్లటి మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.

Similar News

News April 13, 2026

హైదరాబాద్: 12 గంటల్లోపే వాటర్ ట్యాంకర్ డెలివరీ

image

ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, రాత్రి వేళల్లో కూడా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని జూమ్ సమావేశంలో అధికారులకు MD సూచించారు.

News April 13, 2026

పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

image

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్‌లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 13, 2026

మెదక్: ఈ అమ్మాయిలు GREAT

image

ఇంటర్ ఫలితాల్లో మెదక్ మైనారిటీ బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి స్టేట్ ర్యాంకులు సైతం కైవసం చేసుకున్నారు. BiPC-1లో హారిక 438/440 సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, MPC-1లో శృతిక, ఆఫహ బేగం ఇద్దరూ 467/470 సాధించి స్టేట్ 2వ, BiPC -1లో శ్రావణి 436/440 సాధించి స్టేట్ 3వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. MPC-2లో అక్షయ 990/1000 సాధించి మొదటి స్థానంలో నిలిచింది.