News February 14, 2025
వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వికారాబాద్‌లో ఇవాళ 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం చలి, మద్యాహ్నం ఎండతో ప్రజలు బయటికి రావడానికి జంపుతున్నారు. ఇవాళ వికారాబాద్‌లోని హైదరాబాద్ రోడ్డు నిర్మాణష్యంగా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.
News November 7, 2025
ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు రూ.3 కోట్లు విడుదల

నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (NBA) ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం సాగు చేస్తున్న 198 మంది రైతులకు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఒక అకడమిక్ లబ్ధిదారునికి మొత్తం రూ.3 కోట్లు విడుదల చేసింది. యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ABS) విధానంలో భాగంగా ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ ద్వారా పంపిణీ చేశారు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల 48 గ్రామాల రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది.
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.


