News December 15, 2025

వికారాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 7 మండలాల్లో 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 87.77% పోలింగ్ నమోదు కాగా, వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77శాతం, అత్యల్పంగా బంట్వారం మండలంలో 80.25శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో 2,09,847 మంది ఓటర్లు ఉండగా 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News April 8, 2026

WGL: వంశీ కస్టడీ మృతిపై విచారణ

image

జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో 2023, మార్చి 7న జరిగిన వంశీ మృతి కేసుపై జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. కస్టడీలో ఉండగా వంశీ మరణించడంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు వరంగల్ RDO కార్యాలయంలో విచారణ జరగనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారు, సాక్షులు అందరూ తప్పనిసరిగా హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

News April 8, 2026

పల్నాడు: రేపు జిల్లా వ్యాప్తంగా ‘గ్రామ ఆరోగ్య దర్శిని’

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో రేపు ‘గ్రామ ఆరోగ్య దర్శిని’ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. “ప్రతి బాలికకూ HPV వ్యాక్సిన్” అనే నినాదంతో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును ఎలా అరికట్టవచ్చో అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 8, 2026

ట్రంప్.. యుద్ధం వల్ల ఏం సాధించావ్?

image

ఇరాన్‌తో యుద్ధం ద్వారా ట్రంప్ ఏం సాధించారన్న ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధం ముందు వరకు హార్ముజ్ నుంచి నౌకల రవాణా సాఫీగా సాగేది. ప్రపంచంలో ఎలాంటి ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కొరత ఉండేది కాదు. FEB 28న వార్ స్టార్ట్ చేయగానే ఇరాన్ హార్ముజ్‌ను బంద్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం మొదలైంది. ఇప్పుడు తమ ఆర్మీ పర్యవేక్షణలోనే హార్ముజ్ ద్వారా రాకపోకలు సాగుతాయని ఇరాన్ సీజ్‌ఫైర్ ఒప్పందంలో షరతు పెట్టింది.