News February 24, 2025
వికారాబాద్ జిల్లాలో” SUNDAY TOP NEWS”

√ తాండూరు: భద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం. బొంరాస్‌పేట:Way2News కథనానికి స్పందన.√ మహా కుంభమేళాకు హాజరైన పరిగి మాజీ ఎమ్మెల్యే.√ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు.√ బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో జిల్లాలో పెరిగిన ఎఫెక్ట్ పెద్దెముల్: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.√ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష.
Similar News
News February 24, 2025
సిద్దిపేట: రాజీవ్ రహదారిపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

చిన్నకోడూర్ మండలం మల్లారంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2025
వరంగల్: నేటి ప్రజావాణి రద్దు

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ రావద్దని ఆమె సూచించారు.
News February 24, 2025
పాకిస్థాన్‌పై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్

CTలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ వేసిన ట్వీట్ అదిరిపోయింది. ‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’ అంటూ సెటైర్లు వేసింది. ఇక ఓటమి నేపథ్యంలో పాక్‌లో టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.