News January 7, 2026
వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గోపాల్ నాయక్

వికారాబాద్ జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సభావత్ గోపాల్ నాయక్ నియమితులయ్యారు. బుధవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశారు.
Similar News
News January 9, 2026
‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.
News January 9, 2026
గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష: ఎస్పీ శబరీశ్

జిల్లాలో గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. గంజాయి సాగును అడ్డుకునేందుకు డ్రోన్ వ్యవస్థను వాడుతున్నామన్నారు. నరసింహులపేట మండలంలో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలను కోరారు.
News January 9, 2026
బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


