News February 27, 2025

వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

image

✓ పూడూరు: నేడు కంకల్ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం.✓ దుద్యాల: నేడు పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకోనున్న పాలమూరు ఎంపీ డీకే అరుణ.✓ కొడంగల్: నేడు గాడిబాయి శివాలయంలో అన్నదాన కార్యక్రమం.✓ తాండూర్: నేడు భూకైలాస్‌లో పల్లకిసేవ, నేడు ఆయ నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్పీకర్.✓ పరిగి: నేడు బ్రహ్మసూత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.

Similar News

News February 27, 2025

మే 2న కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.

News February 27, 2025

మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

image

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.

News February 27, 2025

సంగారెడ్డిలో ఓటింగ్ శాతం ఇలా..

image

సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం10 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ 8.05 శాతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 12.94గా నమోదైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

error: Content is protected !!