News March 27, 2025

వికారాబాద్ జిల్లా నేటి కార్యక్రమాలు

image

√ కొడంగల్: నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.√ తాండూర్: నేడు ఎల్మకన్నె సహకార సంఘం సర్వసభ్య సమావేశం. కొడంగల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.√బొంరాస్ పేట: నేడు దుప్చర్లలో ఇసుక వేలంపాట. √ దోమ: నేడు దిర్సంపల్లి తైబజార్ వేలంపాట.√బొంరాస్ పేట: నేడు తుంకిమెట్ల తైబజార్ వేలంపాట.√ కొనసాగుతున్న రంజాన్ ఉపవాస దీక్షలు.√ కొనసాగుతున్న కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.

Similar News

News November 15, 2025

అరటి రైతు ఆర్తనాదం

image

అనంతపురం జిల్లాలో అరటి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు కనీస మద్దతు ధర లేక, కొనేవారు కరువై దయనీయ స్థితి నెలకొంది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే ఢిల్లీ మార్కెట్‌కు అరటి చేరుతుండటంతో స్థానిక వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 15వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా, టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 15, 2025

VKB: రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలి: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిగా ఏర్పాటు చేయడమే కాకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News November 15, 2025

భీమడోలు: ఏడేళ్లుగా పరారీ.. నిందితుడి అరెస్ట్

image

భీమడోలు మండలం పూళ్లలో 2007లో జరిగిన హత్య కేసులో గుడివాడకు చెందిన నిందితుడు స్టీవెన్‌ను పోలీసులు శుక్రవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. స్టీవెన్ ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన CI విల్సన్, SI మదీనా బాషా, హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, సురేష్‌ను SP ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామన్నారు.