News March 14, 2025
వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

√ VKB: ఇంటర్ పరీక్షలకు 257 మంది విద్యార్థుల గైర్హాజరు √ పూడూరు:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ √ తాండూరు:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురు నూతన లెక్చరర్ల జాయినింగ్ √ VKB: సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు:అ. కలెక్టర్ √ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలో హోలీ సంబరాలు √బొంరాస్పేట: సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల నిరసన √ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: ఎస్సైలు.
Similar News
News September 15, 2025
పెద్దపల్లి: మహిళలు ఆర్థికంగా ఎదగాలి: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి పథకం కింద పంపిణీ చేసిన చేపల సంచార వాహనాన్ని సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఓదెల మండలానికి చెందిన లబ్ధిదారికి ₹10 లక్షల విలువైన వాహనం 60% సబ్సిడీతో అందించామని తెలిపారు. లభించిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిలో మహిళలు ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
News September 15, 2025
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ఏలూరు JC

ప్రభుత్వం మరోసారి IAS, IPS అధికారుల బదిలీ చేపట్టింది. కొన్ని రోజులుగా IAS, IPS అధికారుల బదిలీ ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం సోమవారం పలువురు IAS, IPS అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ప్రభుత్వం నియమించింది.
News September 15, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ANU పరిధిలో నిర్వహించిన PG సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జులైలో నిర్వహించిన M.SC స్టాటిస్టిక్స్, M.SC బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860ల చొప్పున ఈ నెల 24లోపు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.