News March 1, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓ తాండూర్:స్కూటీని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి.✓ వికారాబాద్:మీసేవ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు.✓ దోమ:బొంపల్లి పాఠశాలను సందర్శించిన డిఇఓ రేణుక దేవి.✓ కొడంగల్:ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు.✓ పరిగి:అత్యధిక నిధులు తీసుకొచ్చాం ప్రచారం చేయడంలో వెనకబడ్డం:ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.✓ పరిగి:మార్చి 8న లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి✓ ధరూర్:హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: ఎస్పీ.
Similar News
News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్‌గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2025
NZB: ఆన్‌లైన్‌లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్‌లు హాల్ టికెట్‌లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు.
News March 1, 2025
NZB: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలోని ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SHO రఘుపతి శుక్రవారం తెలిపారు. పూసల గల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్ (41) గత కొన్ని సంవత్సరాలుగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.