News October 29, 2025
వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- స్పీకర్

తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 30, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?
News October 30, 2025
పీఎంశ్రీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలలకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వర్క్‌లను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 30, 2025
తిరుమలలో పుష్పార్చన గురించి తెలుసా..!

పవిత్రమైన కార్తీక మాసం శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పుష్పాలతో అర్చన చేస్తారు. కనుక దీనిని పుష్పార్చన అని అంటారు. ఈ వేడుక 30వ తేదీ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనుంది.


