News February 27, 2025
వికారాబాద్ జిల్లా బుధవారం ముఖ్యంశాలు

✓ తాండూర్: భూకైలాస్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి.✓ మర్పల్లి: డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్.✓ దామగుండం,బుగ్గ రామలింగేశ్వర స్వామి,పాంబండ రామలింగేశ్వర స్వామి,గాడిబాయి,భూకైలాస్ శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ✓ వికారాబాద్ జిల్లాలో ఘనంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.✓ మహాశివుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఆశీస్సులతో
Similar News
News February 27, 2025
కాకినాడ: ఐదుకు చేరిన జీబీఎస్ కేసులు

కాకినాడ జిల్లాను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో నాలుగు కేసులు ఉండగా బుధవారం ఇదే వైరస్‌తో మరో వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకరు డిశ్చార్జి కాగా నలుగురు చికిత్స పొందుతున్నారు. గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నవారు కాకినాడ జీజీహెచ్‌కు రావాలని సూపరిండెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కోరారు.
News February 27, 2025
HZB: ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆస్పత్రిలకు పంపిస్తున్నారని ఆరోపణల మేర వారం రోజుల క్రితం విచారణ జరిపి డీఎంహెచ్‌వో వెంకట రమణ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి తెలిపారు.
News February 27, 2025
మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమై, వీరభద్ర పల్లెరము, భద్రకాళి పూజ, నిత్య పూజలు జరగనున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాలలో నడుచుట కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమాలు ముగియనున్నాయి. రెండవ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.