News March 1, 2025
వికారాబాద్ జిల్లా శనివారం ముఖ్యంశాలు

✓కొడంగల్: వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలి.✓ VKB: జిల్లా వ్యాప్తంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు.✓ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా సుధీర్.✓ ధరూర్: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.✓ TNDR: 77 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే.✓ VKB:రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.✓ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ అమరవీరులకు నివాళి.
Similar News
News March 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 3, 2025
విశాఖలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొని, పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. రౌడీ షీటర్ల మీద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
News March 3, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.