News February 4, 2025
వికారాబాద్: టెండర్ నోటిఫికేషన్
జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ రెసిడెన్షియల్, స్కూల్స్, హాస్టల్స్, ఇతర ప్రభుత్వ భవనాలకు రంగులు వేయుటకు టెండర్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.15వేల లీటర్ల ఎక్సటరియర్ వాల్ పెయింట్స్ బయట వైపున గోడకి రంగులు అవసరం ఉన్నందున సప్లైచేయుటకు ఆసక్తి సప్లయర్స్‌కు డీలర్స్ తమ టెండర్లను ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కలెక్టరేట్ ఐడీఓసీకి ఈనెల 5న సాయంత్రం వరకు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 4, 2025
స్వల్పంగా తగ్గిన ఆయిల్ ఫాం గెలల ధర
ఆయిల్ ఫాం గెలల ధర జనవరి నెలకు స్వల్పంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్‌లో టన్ను ధర రూ.20,506 ఉంది. జనవరికి రూ.20,487కు తగ్గింది. జనవరిలో ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు.
News February 4, 2025
1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు
TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
News February 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ముత్తారం రామాలయంలో రథసప్తమి వేడుకలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన
∆} కారేపల్లి రైల్వే గేట్ మూసివేత
∆} ఏన్కూర్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు