News February 4, 2026

వికారాబాద్: డిజిటల్ డోర్ నంబర్ల కేటాయింపు

image

కొడంగల్ మండలం అంగడిరాయిచూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాపూర్‌లో మంగళవారం డిజిటల్ ఆన్‌లైన్ డోర్ నంబర్‌ను కేటాయిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ఇకపై గ్రామంలోని ప్రతి డోర్‌పైన నంబర్ కనిపించనుంది. ఈ సంఖ్య ఆన్‌లైన్‌లో సైతం నమోదు చేస్తున్నారు. ఇకపై ప్రజలు ఇంటిపన్నును మీసేవా కేంద్రాల్లో కూడా పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పించింది.

Similar News

News February 7, 2026

ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25% సీట్లు ఫ్రీగా కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనవారు https://cse.ap.gov.in/లో FEB 20 నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు, SC, ST, BCలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

News February 7, 2026

పాడేరు: SC,ST పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన IDP పాలసీ 2024-29 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించిందని జిల్లా పరిశ్రమల అధికారులు శుక్రవారం తెలిపారు. తయారీ, సర్వీసు రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి 45 శాతం రాయితీ లభిస్తుందన్నారు. హోటల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలపై కూడా రాయితీ ఉంటుందన్నారు.

News February 7, 2026

అద్దంకిలో ప్రార్థనా మందిరంపై దాడి..!

image

అద్దంకి రామ్‌నగర్‌లోని ఓ ప్రార్థనా మందిరంపై బుధవారం దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంగులూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి చర్చిని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నారు. 15 మంది వ్యక్తులు మందిరంపై దాడిచేసి, లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బరాజు శుక్రవారం వెల్లడించారు.