News February 28, 2025

వికారాబాద్: తల్లీకొడుకులవి ఆత్మహత్యలే

image

బషీరాబాద్ మం. కాశీంపూర్‌లో <<15575849>>తల్లీకొడుకులు<<>> మొగులప్ప, ఎల్లమ్మది ఆత్మహత్యలే అని పోస్టుమార్టంలో ప్రాథమికంగా తేలింది. పోలీసుల వివరాలిలా.. మొగులప్పకు వచ్చిన జీతం తనకు ఇవ్వడం లేదని, తల్లీకొడుకులే వాడుకుంటున్నారని భార్య రేణుక గొడవ పడి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. మనస్తాపంతో వారు ఇంట్లో గత ఆదివారం ఉరేసుకున్నారు. రేణుకను రిమాండ్‌కు తరలించారు. దీంతో పిల్లలు నందకిషోర్(10), వెన్నెల దిక్కులేని వారయ్యారు.

Similar News

News November 10, 2025

ఆదిలాబాద్: పత్తి, సోయా కొనుగోలు పరిమితిని పెంచాలి

image

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్‌కు వినతిపత్రం అందజేశారు. సోయా ఎకరాకు 6 నుంచి 7.60 క్వింటాళ్లు, సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేయాలని కోరారు.

News November 10, 2025

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలి: నిట్ డైరెక్టర్

image

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలని నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి అన్నారు. సోమవారం ప్రపంచ సైన్స్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిట్‌లో అక్సాసెబుల్ అనలిటికల్ టెక్నాలజీపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన సుబుధి మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యార్థులు నిరంతరం పయనించాలన్నారు. సామజిక బాధ్యతగా ఆవిష్కరణలు చేయాలన్నారు.

News November 10, 2025

సంగారెడ్డి: దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్లు పూర్తయిన రోడ్లకు వెంటనే పనులు ప్రారంభించిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.