News April 3, 2026
వికారాబాద్: దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫూర్తిదాయకం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాటపటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెత్తందారులకు వ్యతిరేకంగా, పేదల కోసం ప్రాణాలర్పించిన కొమరయ్య సేవలను కొనియాడారు. ఆయన త్యాగం చిరస్మరణీయమని అన్నారు.
Similar News
News April 4, 2026
నిర్మల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గ నియామక పత్రాల అందజేత

నిర్మల్‌లో శనివారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News April 4, 2026
SKLM: బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాల సేకరణ

సింగుపురం ఉత్సవాల్లో కలుషిత బాదం పాలు తాగి భక్తులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఆహార భద్రతా విభాగం నిశిత విచారణ చేపట్టింది. జిల్లా ఆహార భద్రతాధికారి లక్ష్మి శనివారం నగరంలోని బాదం పాలు తయారీ కేంద్రాలు, విక్రయించే మొబైల్ ఫుడ్ కార్టులు ముడి సరకు సరఫరా చేసే కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా అనుమానిత బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాలను అధికారి సేకరించారు.
News April 4, 2026
ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాన్నున్న ఎన్నికల్లో బీజేపీకి నో ఛాన్స్: మహేశ్ గౌడ్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిర్మల్‌లో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


