News February 6, 2025
వికారాబాద్: నవల్గా హత్య కేసు మిస్టరీ చేదన
బషీరాబాద్ మండలం నవల్గా శివారులో జరిగిన వ్యక్తి హత్య కేసును మిస్టరీని పోలీసులు చేధించినట్లు బుధవారం DSP బాలకృష్ణారెడ్డి తెలిపారు. CI నగేష్, SI శంకర్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు. స్థలం, పాత కక్షలతోనే వదిన సుగుణమ్మను ముగ్గురుతో కలిసి హత్య చేయించినట్లు తెలిపారు. కేసులోని నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 6, 2025
ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ సత్తా చాటాలి: రేగా కాంతారావు
ఇల్లందు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
News February 6, 2025
త్రివేణీ సంగమంలో నంద్యాల ఎంపీ పుణ్య స్నానం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం తన పూర్వ జన్మ సుకృతం అని ఆమె తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మహా కుంభమేళాకు జిల్లా నుంచి సైతం భక్తులు తరలివెళ్తున్నారు.
News February 6, 2025
కోనసీమలో బైక్ దొంగలు దొరికారు..!
కోనసీమలో బైకులను అపహరిస్తున్న వారిని అరెస్ట్ చేశామని అమలాపురం డీఎస్పీ SKVD ప్రసాద్ వెల్లడించారు. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు పట్టుబడగా.. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.