News October 29, 2025
వికారాబాద్: నేడు జరగాల్సిన పరీక్ష నవంబర్ 1కి వాయిదా

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్ష నవంబరు ఒకటికి వాయిదా వేశామని డీఈవో రేణుకాదేవి ప్రకటించారు. పరీక్ష వాయిదా విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.
Similar News
News October 29, 2025
జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్‌ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News October 29, 2025
వనపర్తి: ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

ఐకెపి ద్వారా కేటాయించబడిన అన్ని వరి కొనుగోలు కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అవసరమైన తూకం యంత్రాలు తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకోవాలని సూచించారు.
News October 29, 2025
తిరుపతి: ఒక్కొక్కరికి రూ.3వేలు

తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పలువురు బాధితులుగా మారారు. వీరికి ప్రభుత్వం రూ.3వేల సాయం ప్రకటించింది. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కలెక్టర్ వెకంటేశ్వర్ వెళ్లారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, నిత్యావసరాలు అందజేశారు.


