News October 24, 2025
వికారాబాద్: పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించాలి: సీపీఎం

పత్తి రైతులకు క్వింటాలుకు రూ.15,000 చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీపీఎం ఆధ్వర్యంలో కలిసి పత్తి రైతులకు క్వింటాలుకు రూ.5 వేల బోనస్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. డిమాండ్‌ను ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ వారికి తెలియజేశారు.
Similar News
News October 25, 2025
కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
News October 25, 2025
మెదక్: సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 25, 2025
KTDM: మహిళకు వేధింపులు.. ముగ్గురికి జైలు శిక్ష

మహిళను అసభ్య పదజాలంతో దూషించి, వేధింపులకు గురిచేసిన కేసులో నిందితులకు దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి భవాని శుక్రవారం జైలు శిక్ష, జరిమానా విధించారు. పెద్దగొల్లగూడెంకి చెందిన సీతారాములు, రఘురాం, వెంకటేశ్ మహిళను వేధించినట్లు నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల ఏడు నెలల జైలు శిక్షతో పాటుగా ఒక్కొక్కరికీ రూ.1,000 జరిమానా విధించారు.


