News March 20, 2025

వికారాబాద్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

image

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2వ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News March 20, 2025

శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

image

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.

News March 20, 2025

విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు ఉపాధ్యాయుల శిక్షణలో ఎంతో శ్రమించి, పట్టుదలతో ఈ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో సన్నదం అయ్యారని తెలిపారు.

News March 20, 2025

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు: ఎస్పీ

image

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని ఆయన అన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయ దారులు యువతనే లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని అన్నారు.

error: Content is protected !!