News March 31, 2025
వికారాబాద్: పవిత్రమైన పండుగ రంజాన్: మాజీ ఎమ్మెల్యే

వికారాబాద్ పట్టణ పరిధిలోని ఆలంపల్లిలో గల ఆలం షాహి దర్గా వద్ద రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులను BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాలలో కొత్త వెలుగును నింపి, కుటుంబంలో శాంతిని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
Similar News
News December 19, 2025
SIR డ్రాఫ్ట్: తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు!

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)తో ECI <<18612809>>తమిళనాడులో<<>> భారీగా ఓటర్లను తొలగించింది. తాజా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం 97 లక్షల ఓట్లను తొలగించగా.. అందులో 26.94 లక్షల ఓటర్లు చనిపోయారని, 66.44L మంది ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారని పేర్కొంది. ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల ఓట్లను కట్ చేసింది. కోయంబత్తూర్ జిల్లాలో 6.50 లక్షలు, తిరుచ్చిలో 3.31 లక్షలు, దిండిగల్‌లో 3.24 లక్షల ఓట్లను తొలగించింది.
News December 19, 2025
కోరంగి వద్ద ఎదురెదురుగా బైకులు ఢీ.. ఒకరి మృతి

తాళ్లరేవు జాతీయ రహదారి 216పై కోరంగి వంతెన సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోరంగి పోలీసులు క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 19, 2025
GNT: ‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందేలా చూస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ హామీ ఇచ్చారు. ‘సామ్నా’ జిల్లా నూతన కమిటీ సభ్యులు ఆయనను కలిసి అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


