News April 4, 2025

వికారాబాద్‌: పెద్దేముల్‌ హత్యకు గురైన యశోద వివరాలు

image

వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళ ఎవరు అనేది నిర్ధారించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బొంరాస్‌పేట మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 14, 2025

‘భూభారతి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: రేవంత్ రెడ్డి

image

TG: 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన పోరాటాలన్నీ భూముల కోసమేనన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’తో రెవెన్యూ అధికారులపై దాడులు జరిగాయన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

error: Content is protected !!