News April 7, 2025
వికారాబాద్: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్‌లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబైకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అప్పటికే ముంబై సమీపించిన విమానాన్ని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. రాత్రి 8.50కి ల్యాండ్ అయిన విమానాన్ని వెంటనే దూరంగా తరలించి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. విమానంలోని 225మందిని సురక్షితంగా కిందికి దించామని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు.
News April 8, 2025
ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా భేటీ అయ్యారు. టారిఫ్‌ల పెంపు అనంతరం ట్రంప్‌తో భేటీ అయిన తొలి దేశాధినేత ఆయనే కావడం గమనార్హం. సుంకాల విషయంతో పాటు హమాస్‌తో నెలకొన్న పరిస్థితులపైనా వారిద్దరూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా దాన్ని శ్వేతసౌధం ఉన్నట్టుండి రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
News April 8, 2025
ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.