News January 13, 2026

వికారాబాద్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది..!

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో తాండూర్ మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 77,110 ఓటర్లు, వికారాబాద్‌లో 34 వార్డులకు 58,117, పరిగిలో 18 వార్డుల్లో 27,616, కొడంగల్‌లో 12 వార్డులకు 11,318 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాను ఆయా మున్సిపాలిటీల్లోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఫైనల్ లిస్ట్‌లో మీపేరు ఉందా చెక్ చేయండి.

Similar News

News February 4, 2026

మహానందిలో మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్య కార్యక్రమాలు ఇవే!

image

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో జరిగే ముఖ్య కార్యక్రమాలు ఇవే.
☞ 13న ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణం
☞ 14న శేష వాహన సేవ, సింహ వాహన సేవ
☞ 15న మహాశివరాత్రి లింగోద్భవ కాల అభిషేకం అనంతరం మహానందీశ్వర దంపతులకు కళ్యాణోత్సవం
☞ 16న ఉదయం అశ్వ వాహన సేవ, రాత్రి పుష్ప పల్లకి సేవ
☞ 17న మహా రథోత్సవం, పుష్ప శయనోత్సవం
☞ 18న పూర్ణాహుతి, తెప్పోత్సవం ఉంటాయని పండితులు తెలిపారు.

News February 4, 2026

సిద్దిపేటలో ఖాళీలు.. APPLY NOW

image

సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీ ఉన్న సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలల HMలను కలవాలని సూచించారు.

News February 4, 2026

​HNK: రేపు అద్దె బస్సుల బంద్

image

వేతనాల పెంపు విషయంలో యజమానుల మొండివైఖరిని నిరసిస్తూ గురువారం HNK, WGL 1 & 2 డిపోల <<19047113>>అద్దె బస్సుల డ్రైవర్లు<<>> సమ్మెకు పిలుపునిచ్చారు. నెలకు కనీసం ₹2,600 పెంచాలని డ్రైవర్లు కోరుతుండగా, యజమానులు కేవలం ₹1,400 మాత్రమే పెంచుతామని తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా మాట్లాడినా, యజమానులు దిగిరాకపోవడంతో, రేపు బస్సులను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు ప్రకటించారు.