News October 18, 2025
వికారాబాద్ బీజేపీ అధ్యక్షుడి రాజీనామా ఆమోదం

VKB జిల్లా బీజేపీ అధ్యక్షుడి రాజీనామాను బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆమోదించారు. జిల్లా పార్టీ కన్వీనర్ ప్రహ్లాదరావును అధ్యక్షుడిగా నియమించారు. చేవేళ్ల ఎంపీగా ఉన్న తనకు తెలియకుండానే జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా అధ్యక్షుడిపై నాయకత్వానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. వివధ వేదికలపై ఒత్తిడి తేవడంతో చర్యలు అనివార్యమయ్యాయి. దీంతో కొండా పంతం నెగ్గినట్లైంది.
Similar News
News October 18, 2025
మెదక్: ’25లోగా IFMIS పోర్టర్‌లో నమోదు చేయాలి’

మెదక్ జిల్లా అధికారులు, డీడీఓలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.
News October 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>
News October 18, 2025
పెళ్లి చేసుకున్న ‘దంగల్’ నటి

‘దంగల్’ సినిమా ఫేమ్ జైరా వసీమ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన భర్త ఫేస్‌ను రివీల్ చేయకుండా ఓ ఫొటోను షేర్ చేశారు. ‘దంగల్’ మూవీలో నటనకుగాను నేషనల్ అవార్డు అందుకున్న ఆమె బాలీవుడ్‌లో ‘సీక్రెట్ సూపర్ స్టార్, ది స్కై ఈజ్ పింక్’ వంటి సినిమాల్లో నటించారు. మత విశ్వాసాల కారణంగా 2019లో ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.