News February 5, 2025
వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్
భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు.
Similar News
News February 5, 2025
ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?
మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్ కాంప్లెక్స్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్‌ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.
News February 5, 2025
పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు
లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News February 5, 2025
SSMB29: ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదా.. విలనా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. కాగా ఈ మూవీ కోసం కాశీలో ఉండే మణికర్ణికా ఘాట్ తరహాలో హైదరాబాద్‌లో సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.