News September 7, 2025
వికారాబాద్: మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా

వికారాబాద్ మున్సిపాలిటీలోని 10వ, 11వ వార్డులలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. గ్రామంలో మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి తమ ప్రాంతంలో మద్యం అమ్మిన వారికి రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని తీర్మానించారు. అలాగే ప్రజల సహకారంతో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
Similar News
News September 8, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఈ రాత్రికి ఢిల్లీకి TG సీఎం రేవంత్
* యూరియాపై ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు: అచ్చెన్న
* గుంటూరు తురకపాలెంలో HYD శ్రీబయోటెక్ శాస్త్రవేత్తల బృందం పర్యటన
* యూరియా కోసం సిద్దిపేటలో రైతుల ఆందోళన.. హైవేపై ట్రాఫిక్ జామ్
* భారత మెన్స్ హాకీ జట్టుకు అభినందనలు: మంత్రి మండిపల్లి
* వరంగల్ (D) మామునూరులో ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్.. TG, AP, బిహార్, ఝార్ఖండ్ NCC విద్యార్థులు హాజరు
News September 8, 2025
మల్లెపూలతో విమానం ఎక్కిన నటికి బిగ్ షాక్

బ్యాగులో మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ నటి నవ్య నాయర్‌కు మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఓనం కార్యక్రమంలో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ వెళ్లగా ఎయిర్‌పోర్ట్ చెకింగ్‌లో మల్లెపూలు కనిపించాయి. ఇది బయో సెక్యూరిటీ చట్టాలకు విరుద్ధమంటూ ఫైన్ వేశారు. పండ్లు, పూలు, విత్తనాల రవాణాతో ప్రయాణికులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ చట్టాలు రూపొందించారు.
News September 8, 2025
నర్సంపేట: కలిసి కట్టుగా సరస్వతి నిలయాన్ని నిలబెట్టారు!

నర్సంపేట మండలంలో మారుమూల గ్రామమైన భోజ్యా నాయక్ తండాలో 15 ఏళ్ల కిందట సర్కారు బడి మూతపడింది. పక్క గ్రామాలకు వెళ్లలేక పలువురు విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపట్లేదని ఈ తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు, రాజకీయ నాయకులు బడిని తెరిపించేందుకు ముందుకు వచ్చారు. తలా కొంత వేసుకొని రూ.లక్షలు వెచ్చించి ఈ ఏడాది తండాలో బడిని పున: ప్రారంభించారు. అక్షరాస్యత దినోత్సవం రోజున తండా వాసులను అభినందించక తప్పదు మరి..!