News February 13, 2025

వికారాబాద్: మరోసారి కనిపించిన చిరుత (UPDATE)

image

వికారాబాద్ అనంతగిరి అడవుల్లో కనిపించిన చిరుత మదనపల్లి బీరోల్ గ్రామ సరిహద్దుల్లో మరోసారి కంటపడింది. బీరోల్ గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ అటుగా వెళుతుండగా చిరుత రోడ్డు దాటుతూ కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత జాడ కోసం సెక్షన్ ఆఫీసర్ అరుణ అన్వేషిస్తున్నారు.

Similar News

News February 14, 2025

జగిత్యాల: బావిలో మృతదేహం.. అడ్రస్ లభ్యం  

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో మృతిచెందిన వ్యక్తి అడ్రసును పోలీసులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన జక్కని సాయికుమార్ (30)గా గుర్తించినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. సాయికుమార్ తన అత్తగారి ఊరైన పోసానిపేట గ్రామానికి ఐదు రోజుల క్రితం వచ్చి వెళ్లాడు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.

News February 14, 2025

MBNR: సర్వం సిద్ధం.. నేడు షబ్-ఎ-బరాత్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా “షబ్-ఎ-బరాత్”కు ముస్లింలు అన్ని మస్జిద్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. షాబాన్ నెలలో 15వ(నేడు) రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ ఆరాధనలు చేస్తూ, తమ కోసం, తమ ప్రియమైనవారి కోసం అల్లాహ్ దయను కోరుతూ గడుపుతారు. షబ్-ఎ-బరాత్‌ను క్షమాపణ రాత్రి లేదా ప్రాయశ్చిత్త దినం అని కూడా పిలుస్తారు. 

News February 14, 2025

స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

image

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!