News January 28, 2025
వికారాబాద్: మహిళా సంఘాలకు కొత్త లీడర్లు

మహిళా సంఘాలకు కొత్త లీడర్లు రానున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు ఇప్పిస్తోంది. కాగా ప్రతి సంఘానికి లీడర్లను సభ్యులు ఎన్నుకుని తమ గ్రూప్‌ను నడిపిస్తారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని మహిళా సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. కొత్త లీడర్లను ఎన్నుకునే ప్రక్రియను చైన్ సిస్టం ద్వారా గ్రామ నుంచి జిల్లా స్థాయి వరకు ఐకేపీ అధికారులు చేపడుతున్నారు.
Similar News
News October 14, 2025
తాజా రౌండప్

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం
News October 14, 2025
యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
News October 14, 2025
భీమ్‌గల్: పాఠశాల బస్సు కిందపడి బాలుడి మృతి

భీమ్‌గల్ మండలం రహత్‌నగర్‌లో మంగళవారం కృష్ణవేణి స్కూల్ బస్సు కిందపడి శ్రీకాంత్(3) అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ఉదయం పాఠశాలకు అతని అన్నను బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం NZB తీసుకెళ్లగా మృతి చెందాడు.