News March 25, 2025
వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 19, 2025
బాపట్ల: రాజస్థాన్‌లో మన జవాన్ మృతి

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్‌లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News September 19, 2025
22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.
News September 19, 2025
HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.