News March 27, 2025

వికారాబాద్: యువకుడి ఆత్యహత్య

image

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన బంట్వారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. యాచారం గ్రామానికి చెందిన సుడే మహిపాల్ రెడ్డి(35) ఇంటిదగ్గర వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై తాగిన మైకంలో ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

Similar News

News September 13, 2025

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విజిలెన్స్‌కు ACB రిపోర్ట్

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశముంది.

News September 13, 2025

KNR: ఘనంగా ‘బొడ్డెమ్మ సంబురం’ ఆరంభం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. KNR(D) వీణవంక మం. నర్సింగాపూర్‌లోని హరిహర క్షేత్రం దేవస్థానంలో మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం బొడ్డెమ్మ పండగ వేడుకలను అట్టాహాసంగా ప్రారంభించారు. కాగా, ఈ వేడుకలో గౌరీ దేవీని ఆరాధిస్తామని, బొడ్డెమ్మ పండగ మట్టి, పూలతో ముడిపడిన ఓ ప్రకృతి పండగని వనితలన్నారు. మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.

News September 13, 2025

కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

image

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.